రైలులో ప్రయాణిస్తూ వ్యక్తి మృతి

రైలులో ప్రయాణిస్తూ వ్యక్తి మృతి

MNCL: రైలులో ప్రయాణిస్తూ ఒక వ్యక్తి మృతి చెందాడు. ఛత్తీస్ ఘడ్‌కు చెందిన ధన్పత్ లాల్ యాదవ్ తమిళనాడులో పనిచేసేందుకు గ్రామస్తులతో కలిసి రైలులో వెళుతుండగా అస్వస్థతకు గురయ్యాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతదేహాన్ని మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో దింపగా.. రైల్వే పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.