ఫోక్సో చట్టంపై అవగాహన

ఫోక్సో చట్టంపై అవగాహన

SKLM: లైంగిక వేధింపులు, ఫోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ గ్రీష్మ, పావని అన్నారు. బుధవారం మెలియాపుట్టి ఎంపీడీవో కార్యాలయంలో ఐ సి డి ఎస్, విద్యాశాఖ, పోలీస్ శాఖ, సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 ఏళ్లలోపు పిల్లలపై జరిగే లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.