మున్సిపల్ సిబ్బందిపై దాడికి యత్నం
గుంటూరు: తెనాలి 32వ వార్డు అమరావతి కాలనీలో మున్సిపల్ స్థలంపై జరుగుతున్న అనధికార నిర్మాణాన్ని శనివారం టౌన్ ప్లానింగ్, సచివాలయ ప్లానింగ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై కొంతమంది స్థానికులు అభ్యంతరం తెలుపగా, ఒక వ్యక్తి పలుగు తీసుకొని సిబ్బందిపై దాడికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.