'ఈ నెల 13 వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోండి'

RR: రైతుబీమా కోసం ఈ నెల 13లోపు దరఖాస్తు చేసుకోవాలని శంషాబాద్ మండల వ్యవసాయాధికారి శ్వేత తెలిపారు. జూన్ 5 వరకు పట్టాపాసు పుస్తకాలు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఫారంలో వివరాలు పూర్తి చేసి పట్టా పుస్తకం, ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను సమర్పించాలన్నారు. 18-59 ఏళ్ల వయస్సు వారు అర్హులన్నారు.