VIDEO: జిల్లాలో సీఎం దిష్టిబొమ్మ దహనం

VIDEO: జిల్లాలో సీఎం దిష్టిబొమ్మ దహనం

ఖమ్మం ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ ముందు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడారు. దేశగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సీఎం దేశ ప్రజలకు, సైనికులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మన సైనికుల ధైర్యసాహసాలను అవమానించేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.