తొగురుమామిడికుంటలో " శుక్రవారం సభ"
KNR: చొప్పదండి మున్సిపల్ పరిధిలోని తొగురుమామిడికుంట అంగన్వాడి కేంద్రంలో "శుక్రవారం సభ" నిర్వహించారు. ఐసీడీసీ సూపర్వైజర్ సంతోషిని మాట్లాడుతూ.. పిల్లలకు పోషకాహారం ఇవ్వాలని, అంగన్వాడి కేంద్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలన గురించి కవిత వివరించారు. పిల్లలపై జరిగే ఆకృత్యాల నివారణపై అవగాహన కల్పించారు.