అమరావతి గీతాన్ని ఆవిష్కరించిన మంత్రి

అమరావతి గీతాన్ని ఆవిష్కరించిన మంత్రి

GNTR: అమరావతి రాజధానిపై నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామానికి చెందిన యేమినేని రామాంజనేయులు రచించిన నూతన గీతాన్ని రాష్ట్ర సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. అమరావతి అభివృద్ధిని ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వ సంకల్పాన్ని ఈ గీతం ప్రతిబింబిస్తోందని మంత్రి చెప్పారు.