కొర్విచేడ్ గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు
VKB: స్థానిక ఎన్నికల నామినేషన్లలో భాగంగా కొర్విచేడ్ గ్రామ సర్పంచ్ పదవికి మాలేమీది స్వాతి నామినేషన్ దాఖలు చేశారు. భర్త లక్ష్మణ్, గ్రామ యువత మద్దతుతో ఆమె నామపత్రాలు సమర్పించారు. గ్రామం కోసం, ప్రతి కుటుంబం కోసం పనిచేయడానికి ముందుకు వచ్చానని తెలిపారు. పెద్దల ఆశీర్వాదం తనకు ఉందని, గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.