సీఎం దిష్టిబొమ్మ దగ్ధం.. 9 మంది పై కేసు నమోదు

సీఎం దిష్టిబొమ్మ దగ్ధం.. 9 మంది పై కేసు నమోదు

KMM: ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా జూలూరుపాడు మండలం కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన 9 మంది సీపీఎం నాయకులపై కేసు నమోదు అయినట్లు సీఐ బాదావత్ రవి తెలిపారు. బుధవారం ఉదయం సీపీఎం నాయకులు ఎటువంటి అనుమతి లేకుండా ప్రధాన రహదారి వెంట నిరసన కార్యక్రమం చేపడుతూ ప్రయాణికుల వాహనాలు ఇబ్బంది కలిగించిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేశామన్నారు