చరిత్ర మరిచిన కోట 'కొండపల్లి కోట'

కృష్ణా: కొండపల్లి కృష్ణా జిల్లాలో ఉన్న ఒక చారిత్రక గ్రామం. ఇది చారిత్రక కోట, కొండపల్లి బొమ్మలు కారణంగా గుర్తింపు పొందింది. 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల కాలంలో కొండపల్లి కోటను నిర్మించారు. తరువాత విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది. కోటలో మూడు అంతస్థుల రాజ భవనం (రాణి మహల్), గోపురాలు, రక్షణ నిర్మాణాలు ఉన్నాయి. ఈ కోట ప్రసుత్తం శిధిలావస్తకు చేరుకుంది.