రాజ్యలక్ష్మిపురంలో ఏనుగుల సంచారం

రాజ్యలక్ష్మిపురంలో ఏనుగుల సంచారం

మన్యం: కొమరాడ మండలం రాజ్యలక్ష్మిపురం గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు శనివారం అటవీశాఖ అధికారులు తెలిపారు. ఒడిస్సా వైపు వెళ్లిన ఏనుగులు మరల వెనక్కి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని, పొలాలకు వెళ్లేటప్పుడు చూసుకుని వెళ్లాలని అధికారులు కోరారు.