మొక్కలు నాటిన సబ్ కలెక్టర్

అన్నమయ్య: మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి శనివారం పట్టణంలో మొక్కలు నాటారు. ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం విరివిగా మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, అధికారులు పాల్గొన్నారు.