బండలాగుడు పోటీల విజేత ఓబుల రెడ్డి

KDP: రాజుపాలెం మండలం వెల్లాల సంజీవరాయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం బండలాగుడు పోటీలు నిర్వహించారు. మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి పోటీలను ప్రారంభించారు. 5 జతల ఎడ్లు పాల్గొన్నాయి. చౌటపల్లెకు చెందిన మార్తల చంద్ర ఓబులరెడ్డి ఎడ్లు తొలిస్థానంలో నిలవడంతో రూ.లక్ష అందజేశారు. 2వ బహుమతిగా రూ.75 వేలు, 3వ బహుమతిగా రూ.50వేలు అందజేశారు.