VIDEO: మావిగన్ పై ఎమ్మెల్యే వసంత గాటు వ్యాఖ్యలు
NTR: మావిగన్‌పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రుల రాజధాని అమరావతేనని, మావిగన్ అనేది పిచ్చివాళ్ల రాజధాని అంటూ విమర్శించారు. రాష్ట్రం, ప్రాంత అభివృద్ధి జగన్‌కు ఇష్టం లేదని ఆరోపించారు. అమరావతిపై కుట్రలు ఫలించలేదని, ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని అన్నారు. అమరావతి మన హక్కు అని, దాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు.