కేంద్రం అలర్ట్.. చమురు నిల్వలపై ఆరా

కేంద్రం అలర్ట్.. చమురు నిల్వలపై ఆరా

దేశ ఇంధన అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చమురు, గ్యాస్ కంపెనీలకు కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. కంపెనీల వద్ద ఉన్న చమురు నిల్వలపై పూర్తి సమాచారం సమర్పించాలని ఆదేశించింది. అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా ముందస్తుగా నిల్వలను పర్యవేక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.