రేపు బొబ్బిలిలో సాధారణ సమావేశం

VZM: బొబ్బిలిలోని మున్సిపల్ సమావేశం హాల్‌లో శనివారం ఛైర్మన్ రాంబార్కి శరత్ బాబు అధ్యక్షతన సాధారణ సమావేశం జరగనుంది. శుక్రవారం కమిషనర్ ఎల్. రామలక్ష్మి ఈ విషయాన్ని తెలియజేశారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి అధికారులు, కౌన్సిలర్లు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. అధికారులు పూర్తి సమగ్ర నివేదికతో రావాలని కమిషనర్ రామలక్ష్మి సూచించారు.