VIDEO: సింగూరు కుడి కాలువ గండిని పరిశీలించిన మంత్రి

SRD: పుల్కల్ మండలం ఇసోజిపేట గ్రామ శివారులో సింగూరు కుడి కాలువకు గండిపడడంతో మంత్రి దామోదర రాజనర్సింహ వెంటనే ఆదివారం పరిశీలించారు. కుడి కాలువ గండి ఎలా పడిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే గండిని పూడ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.