ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
విశాఖ బీవీకే కాలేజీ వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీసీ జిల్లా అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ బీసీ అధ్యక్షులు పోతిబంతి హరికృష్ణ, జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్త కే.కే. రాజు పాల్గొని ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించారు.