పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఆందోళన

పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఆందోళన

NLG: మూడు నెలలుగా గ్రామాల్లో చేస్తున్న ఉపాధి హామీ పనులకు రావలసిన కూలీ డబ్బులు వెంటనే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు.