VIDEO: విద్యాసంస్థలకు విద్యార్థులు ఏటీఎంలా: కృష్ణారెడ్డి

VIDEO: విద్యాసంస్థలకు విద్యార్థులు ఏటీఎంలా: కృష్ణారెడ్డి

GDWL: ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ఏటీఎంలుగా మార్చుకుంటున్నాయని కేటీదొడ్డి మండల బీఆర్ఎస్ నాయకుడు గాజుల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. యాన్యువల్ డే, ఫేర్‌వెల్ డేల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి వేల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారన్నారు. దీనివల్ల తల్లిదండ్రులపై భారం పడుతోందని, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.