శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి: సీఐ

శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి: సీఐ

NGKL: గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు సర్పంచులు సహకరించాలని సీఐ రఘువీర్‌ రెడ్డి కోరారు. వెల్దండ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కురుమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఠాణాకు అనుసంధానించాలని సూచించారు.