చిన్నంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే

చిన్నంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే

ATP: కూటమి ప్రభుత్వం గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. బుధవారం శెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో రూ. 13 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.