దుర్గం చెరువు అందం ఓవైపు.. కంపు మరోవైపు..!
HYDలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఓ టూరిజం ప్రాంతంగా విలసిల్లుతుంది. అనేక మంది పర్యటకులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి చూడడానికి వెళుతుంటారు. కానీ.. అక్కడే ఇప్పుడు కంపుకొట్టే వాతావరణం ఏర్పడిందని, దుర్గం చెరువులోకి డ్రైనేజీ నీరు వెళుతుందని, చెరువు నాశనమవుతుందని, కంటి చాటున.. ఇలా జరగటంపై పర్యావరణ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా ఆవేదించారు.