VIDEO: ప్రభుత్వ పాఠశాలలో మాక్ అసెంబ్లీ కార్యక్రమం
NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్లస్ ఉన్నత పాఠశాలలో జాతీయ రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ వేసే విధానం, ఎలక్షన్ క్యాంపెయిన్ తదితర విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. బుధవారం మాక్ ఎన్నికలు జరుగుతాయని హెచ్ఎం చెంచురామయ్య తెలియజేశారు.