'తెలంగాణ విద్యా కమీషన్ నివేదికను సవరించాలి'
SDPT: తెలంగాణ విద్యా కమిషన్ 2026 నివేదికను వెంటనే సవరించాలని USFI రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి డిమాండ్ చేశారు. ఆదివారం బీజేఆర్ భవనంలో జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక పాఠశాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పేర్కొన్నారు.