బస్టాండ్‌లో బోట్లు నడుపుతూ బీజేపీ నిరసన
TG: వరంగల్‌లో BJP వినూత్న రీతిలో నిరసన తెలిపింది. చెరువును తలపిస్తున్న మోడల్ బస్టాండ్ ప్రాంగణంలో ఆ పార్టీ నేతలు బోట్లు నడిపి నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ కోసం ఓ కాంట్రాక్టర్ తవ్వకాలు జరిపి వదిలేశాడు. దీంతో నీళ్లు నిండి బస్టాండ్ చెరువును తలపిస్తోంది. ఈ క్రమంలో 2 ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగట్లేదని, అధికారులు దృష్టి సారించాలంటూ BJP డిమాండ్ చేసింది.