ఇంటర్ ఫలితాల్లో మెరిసిన మామిడి నిరూపమ
SKLM: ఎల్.ఎన్.పేట మండలం బొర్రంపేట గ్రామానికి చెందిన మామిడి నిరూపమ ఇవాళ విడుదలైన ఇంటర్ ఫస్ట్‌ఇయర్ ఫలితాలలో సత్తాచాటింది. ఆమె ఎంపీసీలో 465/470 మార్కులు సాధించింది. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ ఇంటర్ ఫస్ట్‌ఇయర్ చదువుతోంది. ఈ విజయంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.