వృద్ధుల సమస్యలకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది: కలెక్టర్
JN: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జనగామలోని రుద్రమదేవి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వయోవృద్ధుల సమస్యలకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని, నిర్లక్ష్యం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న 75% ఖర్చుతో వృద్ధాశ్రమం నడుస్తోందని అన్నారు.