చెరువు కట్ట మరమ్మతు పనులను ప్రారంభం

చెరువు కట్ట మరమ్మతు  పనులను ప్రారంభం

KMR: ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్‌లో ఇటీవల కురిసిన భారీవర్షాలకు, వరదలకు 20 రోజుల క్రితం చెరువు కట్ట కోతకు గురైన విషయం విధితమే. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సోమవారం చెరువు కట్ట మరమతు పనులను ప్రోక్లైన్ సాయంతో చేయిస్తున్నట్లు నీటిపారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వం కట్ట మరమతు పనులకు 9.98 లక్షల రూపాయలు మంజూరు చేసిందన్నారు.