పిచ్చికుక్క దాడిలో వృద్ధురాలికి గాయాలు
MNCL: కాసిపేట మండల కేంద్రానికి చెందిన గుమ్ముల రాజమ్మ అనే వృద్ధురాలిపై సోమవారం పిచ్చికుక్క దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాగా, ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఈఎంటీ రాకేష్ తెలిపారు.