రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
కృష్ణా: బాపులపాడు మండల పరిధిలో బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రయాణంలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో నూజివీడు రోడ్, గుడివాడ రోడ్, ఇందిరానగర్, బీసీ కాలనీ, కృష్ణానగర్, ఐటీఐ రోడ్, ఎంఆర్ఓ ఆఫీస్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.