మే డే అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
SRD: మే డే- 2026 పురస్కారాల కోసం అర్హులైన కార్మికులు, యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ రవీందర్ రెడ్డి కోరారు. ఆసక్తి గల వారు ఈనెల 27వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. జిల్లా కమిటీ దరఖాస్తులను పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.