VIDEO: గాజువాకలో పెట్రోల్‌కు బదులు నీరు

VSP: గాజువాకలోని ఆటోనగర్‌లో ఉన్న భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్‌కు బదులు నీరు దర్శనమిచ్చింది. ఓ వాహనదారుడు బంకులో రూ.400లకు పెట్రోల్ కొట్టించుకొని కొద్దిదూరం వెళ్లగానే బైక్ ఆగిపోయింది. అనంతరం ఆ పెట్రోల్‌ను బాటిల్లోకి తీసి పరీక్షించగా నీరు మాత్రమే ఉండటంతో షాక్ అయ్యాడు. బంక్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు.