స్వాతంత్య్ర పోరాటయోధులకు రాచకొండ సీపీ నివాళి

భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో అమరవీరులకు నివాళిగా సీపీ సుధీర్ బాబు పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.