ఉపాధ్యాయుల శిక్షణ షెడ్యూలు విడుదల

SRD: మే నెలలో జరిగే ఉపాధ్యాయుల శిక్షణ షెడ్యూలు విద్యాశాఖ విడుదల చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఫిజికల్ డైరెక్టర్లకు మే 13 నుంచి 17 వరకు, స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీ ఉపాధ్యాయులకు మే 20 నుంచి 24వ తేదీ వరకు శిక్షణ జరుగుతుందని పేర్కొన్నారు.