వీరాపూర్‌లో ప్రభుత్వ బంజరు దొడ్డి కబ్జాకు యత్నం

వీరాపూర్‌లో ప్రభుత్వ బంజరు దొడ్డి కబ్జాకు యత్నం

MNCL: కన్నెపల్లి మండలం వీరాపూర్‌లో ప్రభుత్వ స్థలాల కబ్జాలు తమ గ్రామంలోకి పాకుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బంజరు దొడ్డి గోడలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా గ్రామస్థులు ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు బంజరు దొడ్డి అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.