తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు జారీ
AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్ ద్వారా టీటీడీ టోకెన్లు కేటాయించింది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల దర్శన టోకెన్ల కోసం 25,72,111 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. ఈ-డిప్ ద్వారా 1.76 లక్షల టోకెన్లను జారీ చేసింది. ఈనెల 30న 57వేల మందికి, 31న 64 వేల మందికి, జనవరి 1న 55 వేల మందికి చొప్పున టోకెన్లు కేటాయించినట్లు టీటీడీ వెల్లడించింది.