బాల్య వివాహాల నివారణపై పులివెందులలో అవగాహన
KDP: పులివెందులలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో రామాంజనేయ రెడ్డి బాల్యవివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు బాల్య వివాహాలు చేయడం చట్టవిరుద్ధం అని, జువైనల్ జస్టిస్, పిల్లల లైంగిక నేరాల నిరోధక చట్టం, బాలికల నిష్పత్తి, అమ్మాయి రక్షణ తదితర వాటిపై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. అనంతరం అధికారులు బాల్య వివాహాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు.