VIDEO: జిల్లాలో 15 అడుగుల కింగ్ కోబ్రా కలకలం

VIDEO: జిల్లాలో 15 అడుగుల కింగ్ కోబ్రా కలకలం

మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలో 15 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. జీడిపిక్కలు సేకరిస్తున్న గిరిజనులకు అకస్మాత్తుగా ఈ విషసర్పం తారసపడింది. వెంటనే గ్రామస్థులు అక్కడికి చేరుకుని అప్రమత్తంగా వ్యవహరించి పామును చంపేశారు. అడవి ప్రాంతాల్లో ఇలాంటి విషసర్పాలు సంచరిస్తుండటంతో జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.