ఇంటూరులో తీవ్ర నీటి కష్టాలు
BPT: అమృతలూరు మండలం ఇంటూరులో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇక్కడి వాటర్ ట్యాంక్ మేదర బుట్టను తలపిస్తోంది. కుళాయిల్లో కేవలం అరగంట మాత్రమే నీరు వస్తోంది. ఆ కాస్త సమయంలో కొందరు మోటార్లతో నీటిని లాగేస్తున్నారు. దీంతో మిగతా వారికి చుక్క నీరు కూడా అందడం లేదు. దీనిపై ఎంపీడీవో శేషాంబ స్పందించారు. స్వయంగా గ్రామానికి వెళ్లి ఈ నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.