దేశ రక్షణకు, అభివృద్ధికి బీజేపీకి పట్టంకట్టాలి: అంబాదాస్
NRPT: దేశ రక్షణ, సమగ్ర అభివృద్ధి కొరకు బీజేపీకి ఓటు వేయాలని సీనియర్ నాయకులు అంబాదాస్ అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని బీసీ కాలనిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని కోరారు. దేశంలో సుస్థిర పాలన కొనసాగేందుకు మళ్లీ ప్రధానిగా నరేంద్రమోదీని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.