రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
MNCL: మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తెల్ల షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉండగా.. షర్ట్ కాలర్ పై ఓర్డ్స్ టైలర్, బీపీఎల్ అని ఉంది. మృతుని వివరాలు తెలిసిన వారు 8328512176 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కోరారు.