సారంపల్లి గ్రామ సర్పంచ్‌గా గుగ్గిళ్ళ లావణ్య
SRCL: తంగళ్ళపల్లి మండలంలోని సారంపల్లి గ్రామ సర్పంచ్‌గా గుగ్గిళ్ళ లావణ్య ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. ఈ గెలుపు తన వ్యక్తిగత విజయంగా కాకుండా సారంపల్లి గ్రామ ప్రజలందరి విజయంగా భావిస్తున్నానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించి మద్దతు తెలిపిన గ్రామస్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.