గద్వాల ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు కదలిక

గద్వాల ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు కదలిక

​GDWL: ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌తో జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అర్ధరాత్రి నుంచి బస్సులు డిపోలకే పరిమితం కాగా, ఉదయం 11 గంటల తర్వాత పోలీసుల సహకారంతో ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్ల ద్వారా బస్సులను బయటకు తెచ్చారు. గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.