స్వామివారి కుంభాభిషేకానికి సీఎంకు ఆహ్వానం
GNTR: ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8 వరకు జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ పాలక మండలి ఆహ్వానించింది. పాలక మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనా నాయక్‌లు క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు.