GOOD NEWS: నిధులు విడుదల
TG: రాష్ట్రంలోని నేత కార్మికుల రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకోసం రూ.33 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నేతన్నలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.