పాల్ సాబ్ గుట్ట కార్పొరేటర్‌కు ఘన సత్కారం
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని పాల్ సాబ్ గుట్ట క్రిస్టియన్ కాలనీ కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్‌ను ఆయా ప్రాంతవాసులు బుధవారం ఘనంగా సత్కరించారు. డివిజన్ పరిధిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల రోడ్లు డ్రైనేజీలు మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ.. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.