లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న: హుస్సేన్ నాయక్

జనగామ జిల్లా పర్యటనలో భాగంగా పాలకుర్తిలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధిపై ఆరా తీశారు. కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.