VIDEO: ఉపాధి హామీ వేతనాల కోసం ఎదురుచూపులు
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో జాతీయ ఉపాధి హామీ కూలీలకు వేతనాలు తీవ్రంగా ఆలస్యం అవుతున్నాయని కూలీలు తెలిపారు. పని చేసి 8 వారాలు గడిచినా డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల కోసం అప్పులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.