మాజీ సర్పంచ్ మృతి.. సండ్ర నివాళి
KMM: పెనుబల్లి మండలం మండలపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తడికమల్ల మంగమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వారి నివాసానికి వెళ్లి మంగమ్మ పార్దివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కాకటి ప్రకాష్ ఉన్నారు.